దుబాయ్: యెమెన్‌లోని రస్ ఇసా ఆయిల్ పోర్టుపై అమెరికా భీకర దాడులు చేసిందని హౌతీ ఉగ్రవాదులు శుక్రవారం ప్రకటించారు. ఈ దాడిలో 74 మంది మరణించారని, 171 మంది గాయపడ్డారని చెప్పారు. ఈ ఉగ్రవాదులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్వహిస్తున్న దాడుల్లో ఇదే అత్యంత భీకరమైనది.
ఈ ఆయిల్ పోర్ట్ ద్వారా ఇరాన్ మద్దతు గల హౌతీ ఉగ్రవాదులకు నిధులు సమకూరుతున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ చెప్పింది. వారికి ఆదాయాన్ని అందిస్తున్న ఈ చట్టవిరుద్ధ మార్గాన్ని నిర్మూలించడం కోసమే దాడి చేసినట్లు తెలిపింది. పదేళ్ల నుంచి హౌతీలు ఈ ప్రాంతాన్ని భయకంపితం చేస్తున్నారని మండిపడింది.