న్యూఢిల్లీ : అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సారథ్యంలోని ‘ప్రాజెక్ట్ కైపర్’ భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఇప్పటికే భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందగా, ప్రాజెక్ట్ కైపర్ ఇటీవలే భారత టెలి కమ్యూనికేషన్ విభాగానికి దరఖాస్తు చేసుకుంది.
దీంతో ఉపగ్రహ ఇంటర్నెట్ రంగంలో పోటీ పెరగనుంది. భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత వేగంగా ఇంటర్నెట్ను అందించడం, ఇంటర్నెట్ లేని ప్రాంతాలకు కూడా డిజిటల్ కనెక్టివిటీని అందించడమే ‘ప్రాజెక్ట్ కైపర్’ లక్ష్యం.