వాషింగ్టన్: ఉద్యోగాలు ఇవ్వడంలో అమెరికాలో రెండో అతి పెద్ద కంపెనీగా నిలిచిన అమెజాన్ ఇప్పుడు దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులకు బదులుగా రోబోలను నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రకారం, తదుపరి భారీ వర్క్‌ప్లేస్ షిఫ్ట్ అంచున అమెజాన్ ఉంది.
ఈ కంపెనీలో అమెరికాలో పని చేసేవారి సంఖ్య 2018తో పోల్చుకుంటే మూడు రెట్లు పెరిగి, 12 లక్షల మందికి చేరింది. 2027నాటికి 1,60,000 మంది ఉద్యోగులను నియమించుకోవలసి ఉంటుందని, కానీ ఆ నియామకాలను తప్పించుకునే అవకాశం ఉందని ఈ కంపెనీ ఆటోమేషన్ టీమ్ అంచనా వేస్తున్నది.