శాన్ ఫ్రాన్సిస్కో, జనవరి 19: తమ ‘బై విత్ ప్రైమ్’ యూనిట్లో 5 శాతం ఉద్యోగులను తగ్గిస్తున్నట్టు అమెజాన్ తాజాగా వెల్లడించింది. తరచూ తమ బృందాల నిర్మాణాన్ని, వ్యాపారాన్ని, అవసరాలను సమీక్షించి కొద్ది మంది ఉద్యోగులను తొలగించాలన్న కఠిన నిర్ణయాన్ని తీసుకొంటామని అమెజాన్ అధికార ప్రతినిధి తెలిపారు. తొలగించిన ఉద్యోగులు తమ కంపెనీలోనే కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడానికి సాయం చేస్తున్నామని అమెజాన్ తెలిపింది. గత వారం నాలుగు విభాగాల్లో వందలాది ఉద్యోగులను అమెజాన్ తొలగించింది.