Blue origin | బెజోస్ స్పేస్ జర్నీ సక్సెస్.. 11 నిమిషాల్లో 105 కిలోమీటర్ల ప్రయాణం
Blue origin | అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా ముగిసింది. 11 నిమిషాల్లో 105 కిలోమీటర్లు ప్రయాణించి భూమికి తిరిగివచ్చారు.

వాషింగ్టన్ : అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా ముగిసింది. 11 నిమిషాల్లో 105 కిలోమీటర్లు ప్రయాణించి భూమికి తిరిగివచ్చారు. బెజోస్ వెంట మరో ముగ్గురు కూడా అంతరిక్ష ప్రయాణం చేశారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.42 నిమిషాలకు పశ్చిమ టెక్సాస్ నుంచి రోదసీలోకి బయల్దేరిన బ్లూ ఆరిజిన్ సంస్థకు చెందిన న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్.. తిరిగి 11 నిమిషాల్లో భూమికి చేరుకున్నది. సాధారణ మనుషులు కూడా అంతరిక్ష యాత్రలు చేయాలన్న ఉద్దేశంతోనే బెజోస్ ఈ యాత్రను చేపట్టినట్లుగా బ్లూ ఆరిజన్ సంస్థ వెల్లడించింది.
గాలిలోకి ఎగరడానికి 45 నిమషాల ముందు అంతరిక్ష ప్రయాణం చేయనున్న నలుగురు స్పేస్ షిప్లో ఆసీనులయ్యారు. స్పేస్ షిప్లో ప్రయాణానికి సంబంధించిన విశేషాలను తెలుసుకునేందుకు ముందస్తుగా శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటుచేశారు. వ్యోమనౌక గాల్లోకి లేచిన 3 నిమిషాలకు బెజోస్ ప్రయాణిస్తున్న క్యాప్సూల్.. స్పేస్ క్రాప్ట్ నుంచి విడిపోయింది. ఈ క్యాప్సూల్ కేవలం 4 నిమిషాల్లోనే సముద్ర మట్టానికి 105 కిలోమీటర్ల దూరంలోని కార్మాన్ లైన్‌ను దాటింది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత క్యాప్సూల్ భూమిపైకి విజయవంతంగా తిరిగొచ్చింది. ప్యారాచూట్ సాయంతో క్యాప్సూల్ ఎడారిలో దిగగానే బ్లూ ఆరిజిన్ సంస్థకు చెందిన నిపుణులు, ఉద్యోగులు బెజోస్ వద్దకు చేరుకుని ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు.
అంతరిక్ష పర్యాటకంలో కీలక అడుగుగా భావించే జెఫ్ బెజోస్ స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో జెఫ్ బెజోస్‌తో పాటు బెజోస్ సోదరుడు మార్క్, పైలట్ వాలీ ఫంక్, అంతరిక్ష యానం చేస్తున్న అతి పిన్న వయస్కుడైన ఆలివర్ డెమెన్ ఉన్నారు. న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్‌లో మనుషులు ప్రయాణించడం ఇదే మొదటిసారి. ఈ నెల 11 న రిచర్డ్ బ్రాన్సన్కు చెందిన వర్జిన్ స్పేస్ షిప్ విజయవంతంగా ఆకాశంలోకి దూసుకెళ్లింది. ఈ స్పేస్ షిప్ కేవలం 85 కిలో మీటర్లు మాత్రమే ప్రయాణించింది. దీనిలో భారత సంతతికి చెందిన బండ్ల శిరీష కూడా ప్రయాణించింది.
ఇవి కూడా చదవండి..
ఆకాశంలో బర్త్‌డే, పెండ్లి రోజు ఫంక్షన్లు..! ఎక్కడంటే?
ఇంట్లో ఫోన్ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!
భారత్‌తో సంబంధాలు కోరుకుంటున్నాం: నేపాల్ ప్రధాని డ్యూబా
మెక్సికో మాజీ అధ్యక్షులపై ఆగస్టు 1 న రెఫరెండం
సిద్ధమైన 3 డీ ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..?
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
చరిత్రలో ఈరోజు.. విభజించు పాలించు ప్రారంభం
ఈ వ్యాయామం రోజూ చేస్తే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.. ఏంటది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

