Hijacked Cargo Ship | వాణిజ్య నౌకలో సిబ్బంది సురక్షితం.. భారత నేవీ వెల్లడి
Hijacked Cargo Ship | గురువారం సోమాలియా సముద్ర జలాల్లో హైజాకింగ్ కు గురైన వాణిజ్య నౌకకు భారత నావికాదళ కమెండోలు విముక్తి కలిగించారు.
Hijacked Cargo Ship | గురువారం సాయంత్రం హైజాకింగ్‌కు గురైన కార్గో నౌక ‘ఎంవీ లిలా నార్ఫోల్క్’ కు విముక్తి కలిగింది. అందులో ప్రయాణిస్తున్న 15 మంది భారతీయులతోపాటు 21 మంది క్రూ సిబ్బంది సురక్షితం అని అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ వాణిజ్య నౌక లైబీరియా నుంచి వస్తుండగా సోమాలియా సరిహద్దుల్లో దుండగులు హైజాక్ చేశారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత నేవీ అప్రమత్తమై ఐఎన్ఎస్ చెన్నై వార్ షిప్‌ను రంగంలోకి దింపింది. మారిటైం పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్లు, పీ-8ఎల్, లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాప్ట్, ప్రెడేటర్ ఎంక్యూ9బీ డ్రోన్లను రంగంలోకి దించారు. హైజాకింగ్‌కు గురైన వాణిజ్య నౌకను చుట్టు ముట్టారు. నేవీ కమెండోలు, ఇతర భద్రతా సిబ్బంది వాణిజ్య నౌకలో ఉన్న హైజాకర్లను తుద ముట్టించారు. నౌకలో హైజాకర్లు హతమయ్యారని భారత నేవీ ఓ ప్రకటనలో తెలిపింది.
‘15 మంది భారతీయులతోపాటు 21 మంది సిబ్బందిని సిటాడెల్ నుంచి సురక్షితంగా తరలించాం’ అని భారత నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మాధ్వాల్ తెలిపారు. హైజాకింగ్ కు ప్రయత్నించిన సముద్ర దొంగలకు ఇండియన్ నేవీ మారిటైం పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ తీవ్ర హెచ్చరికలు చేసింది. దీంతో హైజాకర్లు పారిపోయారని ఆయన చెప్పారు.
లైబీరియా నుంచి వస్తున్న వాణిజ్య నౌక హైజాకింగ్‌కు గురైందన్న సమాచారాన్ని బ్రిటిష్ మిలిటరీ ఆర్గనైజేషన్ – యూకే మారిటైం ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీఓ) నివేదించింది. సముద్ర జలాల్లో వివిధ నౌకల కదలికలను ఈ సంస్థ ట్రాక్ చేస్తుంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

