మన భూమికి ఆవల ఏదో ఒక గ్రహంపై ఏలియన్స్ ఉన్నారని చాలామంది నమ్ముతుంటారు. కొందరు పరిశోధకులు గ్రహాంతరవాసులపై పరిశోధనలు కూడా చేస్తున్నారు. కాగా, ఇంటర్నెట్లో ప్రస్తుతం ఓ ఏలియన్ నాణెం చక్కర్లు కొడుతోంది. తనకు దొరికిన నాణెంపై ఏలియన్ బొమ్మ ఉండడంతో ఆశ్చర్యపోయిన వ్యక్తి దాని ఫొటోను సోషల్‌మీడియాలో పెట్టాడు.
జోర్డాన్ అనే వ్యక్తికి క్వార్టర్స్ రోల్లో ఈ అసాధారణమై నాణెం దొరికింది. దానికి ఒకవైపు గ్రహాంతరవాసి తల ముద్రించి ఉంది. ఈ కాయిన్ ఫొటోను జోర్డాన్ తన రెడ్డిట్ అకౌంట్లో షేర్ చేశాడు. దీన్ని చూసి నెటిజన్లు మొదట ఆశ్చర్యపోయారు. అలాగే, ఆసక్తిగా గమనించారు. ఈ నాణెం రెండోవైపు ఏముంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వెనుక భాగం అపోకలిప్స్ తేదీని చూపుతుందని, నాణెం కలిగి ఉన్నవారు మాత్రమే దానిని చూడగలరని జోర్డాన్ సమాధానం చెప్పాడు.
ఈ కాయిన్‌ను చివరగా హోబో నికెల్స్ అని నిపుణులు తేల్చారు. ఈ హోబో నికెల్స్ యూఎస్‌లో 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రసిద్ధి చెందాయి. ఆ సమయంలో నిరాశ్రయులైన వ్యక్తులు కత్తులు, ఇతర సాధనాలను ఉపయోగించి వారు సొంతంగా నాణేలను తయారుచేసుకున్నారు. వాటిని హోబో నికెల్స్ అని పిలుస్తారు. చిన్న విలువలతో కూడిన ఈ నాణేలను వారు వాడేవారు. 1913 నుంచి 1980 వరకు దాదాపు 200,000 క్లాసిక్ హోబో నికెల్లు చలామణి అయినట్లు నిపుణులు చెబుతున్నారు.