Vegetables | కూరగాయలను తినలేకపోతున్నారా.. ఈ మార్గాలను ప్రయత్నించండి..
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వింటూ ఉంటారు. అయితే కూరగాయలను నేరుగా తినడం ఇష్టం లేని వారు చాలామందే ఉంటారు. అలాంటి వారు తమ రోజువారీ ఆహారంలో కూరగాయలను సులభంగా చేర్చుకునేందుకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
Vegetables | కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వింటూ ఉంటారు. అయితే కూరగాయలను నేరుగా తినడం ఇష్టం లేని వారు చాలామందే ఉంటారు. అలాంటి వారు తమ రోజువారీ ఆహారంలో కూరగాయలను సులభంగా చేర్చుకునేందుకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కూరగాయలను బలవంతంగా తినకుండా, నచ్చిన రుచులు, రూపాల్లో ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా వాటిని ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. రోజుకు తొమ్మిది కప్పుల కూరగాయలు తీసుకోవడం ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ఉపయోగపడుతుందని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. కూరగాయలను నేరుగా తినడం కష్టంగా అనిపిస్తే వాటితో జ్యూస్ తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఉదాహరణకు టమాటా, క్యారెట్, బీట్రూట్తో తయారు చేసే జ్యూస్ రుచిగా ఉండటంతో పాటు కూరగాయలను ఆహారంలో చేర్చుకునే సులభమైన మార్గంగా ఉపయోగపడుతుంది.
జ్యూస్ రూపంలో..
పుదీనా, కొత్తిమీరతో తయారు చేసే జ్యూస్‌ను కూడా తీసుకోవచ్చు. రోజులో రెండు రకాల కూరగాయల జ్యూస్‌లు తీసుకోవడం ద్వారా గణనీయమైన మొత్తంలో కూరగాయలను ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల కూరగాయలు తినడం పూర్తిగా భర్తీ చేయకూడదని గుర్తుంచుకోవాలి. కూరగాయలను నేరుగా తినడం ఇష్టం లేని వారిలో చాలామందికి సలాడ్లు మాత్రం నచ్చుతాయి. అలాంటి వారు బొప్పాయి సలాడ్, ఆకుకూరల సలాడ్, దానిమ్మ-కీరదోస సలాడ్ వంటి వాటిని ప్రయత్నించవచ్చు. ఇలా సలాడ్ల రూపంలో కూడా రోజువారీ ఆహారంలో కూరగాయలు, ఇతర పోషక పదార్థాలను సులభంగా చేర్చుకోవచ్చు. సలాడ్లలో కూరగాయలను సహజ రూపంలో తీసుకోవడం వల్ల వాటిలోని పీచు పదార్థాన్ని పొందవచ్చు. అలాగే కూరగాయలలో ఉండే సహజమైన క్రంచ్, తాజాదనం సలాడ్లను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. కూరగాయలను వండుకుని తినడం ఇష్టం లేని వారికి సలాడ్లు మరో మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.
సలాడ్‌గా కూడా తీసుకోవచ్చు..
రోజువారీ ఆహారంలో చివరగా సాధారణ కూరగా లేదా భాజీగా కూరగాయలను తీసుకోవచ్చు. అంటే జ్యూస్, సలాడ్, వండిన కూర అనే మూడు రకాలుగా కూరగాయలను రోజంతా విభజించుకుని తీసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో కూరగాయలు తినాల్సిన అవసరం లేకుండా రోజువారీ ఆహారంలో వాటిని సులభంగా చేర్చుకోవచ్చు. కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలనే లక్ష్యం మొదట్లో భారంగా అనిపిస్తుందని, అయితే వాటిని వివిధ రూపాల్లో రోజంతా విభజించుకుంటే సులభంగా అలవాటు చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేదా పగటిపూట తాజా కూరగాయల జ్యూస్, మరో సమయంలో రంగురంగుల సలాడ్, భోజనంలో వండిన కూరను చేర్చుకోవచ్చు. అయితే కూరగాయల జ్యూస్‌లు మాత్రమే తీసుకుంటూ, తాజా కూరగాయలను పూర్తిగా మానేయడం సరైన పద్ధతి కాదు. సలాడ్ల ద్వారా సహజమైన పీచు పదార్థాన్ని పొందవచ్చు. వండిన కూరగాయలు మెత్తగా మారడంతో రోజువారీ భోజనంలో వాటిని సులభంగా చేర్చుకోవచ్చు. అందువల్ల జ్యూస్, సలాడ్, వండిన కూర.. ఇలా వివిధ రూపాల్లో కూరగాయలను తీసుకోవడం మంచిది. కూరగాయలను తినడం ఇష్టం లేని వారు తమకు నచ్చిన రుచులు, పదార్థాలు, వంట విధానాలను గుర్తించి వాటికి అనుగుణంగా కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో కూరగాయలు తినడం కంటే రోజంతా వివిధ రకాలుగా తీసుకోవడం సులభమైన మార్గంగా ఉంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

