Age Fraud : దేశవాళీ క్రికెట్లో మెరుస్తున్న యువ క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) బిగ్ షాకిచ్చింది. అండర్-19 వరల్డ్‌కప్ విజేత రవి కుమార్(Ravi Kumar), అండర్19 స్క్వాడ్‌లోని రోహిత్ యాదవ్(Rohit Yadav)లపై నిషేధం విధించింది. వయసు పరమైన నేరానికి పాల్పడినందున వీరిద్దరిని రెండేళ్లు సస్పెండ్ చేసింది బీసీసీఐ. రోహిత్ యాదవ్‌పై రెండేళ్లు నిషేధం విధించాం. మరో 62మందిని కూడా రెండేళ్ల కాలానికి సస్పెండ్ చేశాం అని శుక్రవారం బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
భారత అండర్-19 స్క్వాడ్‌లోని రోహిత్ యాదవ్‌పై రెండేళ్ల నిషేధం విధించింది బీసీసీఐ. ఇటీవలే శ్రీలంకపై రాణించి.. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన ఈ లెగ్ స్పిన్నర్‌కు ఇది ఊహించని షాక్. అలానే 2022లో అండర్-19 వరల్డ్‌కప్ గెలుపొందిన భారత జట్టులోని సభ్యుడు రవి కుమార్ కూడా వేటుకు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్‌కు చెదిన రోహిత్ జట్టులో చోటు కోసం తన వయసును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని పసిగట్టిన బీసీసీఐ విచారణ చేపట్టింది. శ్రీలంక పర్యటన సమయంలో అతడు సమర్పించిన వయసు ధ్రువీకరణ పత్రాల్లో పుట్టిన సంవత్సరం వేర్వేరుగా ఉంది.
Rohit Yadav, a legspinner who was part of India’s Under-19 tour of Sri Lanka in July this year, has been handed a two-year ban for age fraud https://t.co/dQwQFC8peb
— Cricinfo (@cricinfo) September 4, 2026
ఒకదాంట్లో రోహిత్ 2007లో జన్మించినట్టు ఉండగా.. ఆధార్ కార్డులో మాత్రం 2009లో రోహిత్ పుట్టినట్టు ఉంది. ఇదివరకే ఈ విషయం తెలిసిన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ రోహిత్‌ను జూనియ్ స్థాయిలో ఆడనివ్వలేదు. ఇప్పుడు బీసీసీఐ కూడా అతడి పుట్టిన సంవత్సరంలో తేడాలు ఉండడాన్ని తీవ్రంగా పరిగణించింది. అతడు తన వయసును దాచేందుకు ప్రయత్నించాడని నిర్ధారించుకున్న భారత బోర్డు రెండేళ్లు సస్పెండ్ చేసింది.
అతడితో పాటు వయసు సంబంధిత ధ్రువపత్రాలు సరిగ్గా లేని 62 మందిపై వేటు వేసింది బీసీసీఐ. అంతేకాద.. ఎడమ చేతివాటం స్పిన్నర్ విషాల్ భాట్టి సైతం ఈ లిస్ట్‌లో ఉన్నాడు. ఈ అరవై రెండు మందిని 2026-27, 2027-28 దేశవాళీ సీజన్లో తమ పేర్లు నమోదు చేసుకోవదద్దని బీసీసీఐ తెలిపింది.