పారిస్: ఫ్రెంచ్ చరిత్రలోనే అత్యంత ఘోర విమాన ప్రమాదాలలో ఒకటైన 2009 నాటి ఫ్లైట్ ఏఎఫ్447 దుర్ఘటనకు సంబంధించి ఎయిర్‌బస్, ఎయిర్ ఫ్రాన్స్‌లను దోషులుగా పారిస్ న్యాయస్థానం గురువారం నిర్ధారించింది. ఈ రెండు సంస్థలు అసంకల్పిత నరహత్య నేరానికి పాల్పడినట్టు పేర్కొంది. ఈ ప్రమాదంలో విమానంలోని 228 మంది ప్రయాణికులు మరణించారు.
ఫ్రెంచ్ చట్టాల ప్రకారం రెం డు కంపెనీలు ఒక్కో బాధిత కుటుంబానికి 2,60,600 డాలర్లు జరిమానా చొప్పున మొత్తం 120 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. విమాన తయారీలో లోపం, పైలట్ల శిక్షణ లేమి ప్రమాదానికి కారణాలుగా కోర్టు నిర్ధారించింది.