హైదరాబాద్: ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా దాడులను ఉధృతం చేసింది. ఇప్పటికే రేవుపట్టణమైన ఖేర్సన్ను తమ నియంత్రణలోకి తెచ్చుకున్న రష్యన్ బలగాలు రాజధాని కీవ్, రెండో అతిపెద్ద నగరమైన ఖర్వివ్, మర్యుపోల్ను దిగ్బంధించాయి. అదేవిధంగా ఎనర్హోదర్ నగరాన్ని చుట్టుముట్టిన మాస్కో బలగాలు యూరప్‌లోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన జపోరిజియా (Zaporizhzhia)పై దాడిచేశాయి. నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఇదిలాఉంటే ఒడెస్సా, బిలా సెర్క్వా, వొలిన్ ఒబ్లాస్ట్ ప్రాంతాల్లో రష్యా వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. అక్కడ ఉన్న ప్రజలు సమీపంలోని షెల్టర్లలోకి వెళ్లాలని సూచించారు.