Air Canada | వాంతి ఉన్న సీట్లలో కూర్చొనేందుకు నిరాకరించిన మహిళలు.. బలవంతంగా విమానం నుంచి దించివేత
Air Canada | వాంతి ఆనవాళ్లు ఉండటంతో పాటు బాగా చెడు వాసన వస్తున్న సీట్లలో కూర్చొనేందుకు ఇద్దరు మహిళా ప్రయాణికులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో వారిని బలవంతంగా విమానం నుంచి దించివేశారు.
ఒట్టావా: వాంతి ఆనవాళ్లు ఉండటంతో పాటు బాగా చెడు వాసన వస్తున్న సీట్లలో కూర్చొనేందుకు ఇద్దరు మహిళా ప్రయాణికులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో వారిని బలవంతంగా విమానం నుంచి దించివేశారు. కెనడా దేశంలో ఈ సంఘటన జరిగింది. సీటెల్ నుంచి మాంట్రియల్‌కు ప్రయాణించేందుకు ఇద్దరు మహిళలు ఎయిర్ కెనడా (Air Canada) విమానం ఎక్కారు. అయితే అంతకు ముందు ఆ విమానంలో ప్రయాణించిన వ్యక్తి వారి సీట్లలో వాంతి చేసుకోగా సిబ్బంది సరిగా శుభ్రం చేయలేదు. దీంతో పాటు చెడు వాసన రావడాన్ని మహిళా ప్రయాణికులు గమనించారు. ఈ నేపథ్యంలో తమకు వేరే సీట్లు కేటాయించాలని విమాన సిబ్బందిని కోరారు.
కాగా, విమానం ప్రయాణికులతో నిండిపోవడంతో ఆ మహిళా ప్రయాణికుల అభ్యర్థనను విమాన సిబ్బంది తిరస్కరించారు. తాము ఐదు గంటలు ప్రయాణించాల్సి ఉందని వారు రిక్వెస్ట్ చేసినప్పటికీ పట్టించుకోలేదు. ఇంతలో పైలట్ జోక్యం చేసుకున్నాడు. వాంతి ఆనవాళ్లు ఉన్న ఆ సీట్లలో ప్రయాణించని పక్షంలో విమానం నుంచి దిగిపోవాలని చెప్పాడు. అలా చేయని పక్షంలో వారిద్దరిని నో ఫ్లై లిస్ట్‌లో చేర్చుతామని హెచ్చరించాడు. దీంతో సిబ్బంది ఆ ఇద్దరు మహిళలను విమానం నుంచి కిందకు దించేశారు.
మరోవైపు ఆ ఇద్దరు మహిళల సీట్ల పక్కన సీటులో ప్రయాణించిన మరో మహిళా ప్రయాణికురాలు సుసాన్ బెన్సన్ ఈ విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. వాంతి ఉన్న సీట్లలో ప్రయాణించాలని లేని పక్షంలో దిగిపోవాలని ఇద్దరు మహిళా ప్రయాణికులను హెచ్చరించారని, వారిని బలవంతంగా విమానం నుంచి దించివేశారని అందులో ఆరోపించారు. ఎయిర్ కెనడా విమాన పైలట్ తీరును విమర్శించారు.
కాగా, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎయిర్ కెనడా సంస్థ స్పందించింది. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. తమ సిబ్బంది నుంచి తగిన మర్యాద అందుకోని ఆ ప్రయాణికుల నుంచి క్షమాపణలు కోరుతామని వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Air Canada
- get off
- Passengers
- Plane
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

