వాషింగ్టన్: ఫేస్బుక్లో(Facebook)కి మళ్లీ డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎంట్రీ ఇచ్చారు. ఆయన యూట్యూబ్ అకౌంట్‌ను కూడా మళ్లీ స్టార్ట్ చేశారు. రెండేళ్ల క్రితం క్యాపిటల్ హిల్(Capitol Hill)పై దాడి జరిగిన తర్వాత.. ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్లపై బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ట్రంప్ అకౌంట్లను మళ్లీ ఓపెన్ చేశారు. ఇక తన తొలి పోస్టును చేశారాయన. ఐయామ్ బ్యాక్(Iam Back) అంటూ ఫేస్బుక్లో ఫస్ట్ పోస్టు పెట్టారు. 12 సెకండ్ల వీడియో క్లిప్‌లో.. ఆయన 2016లో అధ్యక్ష ఎన్నికల్లో విజయం తర్వాత ఇచ్చిన విక్టరీ సందేశం ఉంది. అయితే ఇన్నాళ్లూ వెయిటింగ్లో పెట్టినందుకు అభిమానులకు ఆయన సారీ చెప్పారు.
76 ఏళ్ల ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఆయనకు ఫేస్బుక్లో 34 మిలియన్ల ఫాలోవర్లు(Million Followers) ఉన్నారు. ఇక యూట్యూబ్(Youtube)లో 2.6 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. 2021, జనవరి ఆరో తేదీన జరిగిన క్యాపిటల్ హిల్ ఘటన తర్వాత ట్రంప్‌పై ఆంక్షలు విధించారు. ప్రజల్ని రెచ్చగొడుతున్నారని చెప్పి ఆయన ట్విట్టర్, ఎఫ్బీ, యూట్యూబ్ అకౌంట్లను నిషేధించారు. అయితే రెండు నెలల క్రితం ఫేస్బుక్ ట్రంప్ అకౌంట్‌ను అన్‌లాక్ చేసింది. ఇక శుక్రవారం రోజు యూట్యూబ్ కూడా ట్రంప్ అకౌంట్‌ను రీస్టార్ట్ చేసింది.
డోనాల్డ్ ట్రంప్ ఛానల్(Trump Channel) ఇక నుంచి యూట్యూబ్ కాంటెంట్‌ను పోస్టు చేసుకోవచ్చు అని యూట్యూబ్ కూడా ప్రకటన జారీ చేసింది.