బీజింగ్: జీరో కోవిడ్ పాలసీ వల్ల చైనీయులు చిర్రెత్తిపోతున్నారు. కఠిన్ లాక్డౌన్ ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఉరుమ్కి పట్టణంలో ఇవాళ భారీ ఎత్తున ప్రజలు నిరసనలు నిర్వహించారు. ఆ నగరంలో ఓ బిల్డింగ్లో మంటలు వ్యాపించడం వల్ల పది మంది మృతిచెందారు. ప్రజలు బయటకు రాకుండా గేట్లకు తాళాలు వేయడం వల్ల ఈ విషాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఉరుమ్కిలో అధికారుల ప్రవర్తనకు వ్యతిరేకంగా ప్రజలు భారీ ఆందోళన చేపట్టారు. కోవిడ్ లాక్డౌన్ను అంతం చేయాలని నినాదాలు చేశారు. ఆందోళనకారులకు చెందిన వీడియోలు ప్రస్తుతం చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.