iPhone Survives 16,000 Foot Drop | 16,000 అడుగుల ఎత్తులో అలాస్కా విమానం నుంచి కింద పడిన ఐఫోన్.. అయినా పనిచేస్తోంది
iPhone Survives 16,000 Foot Drop | అలాస్కా విమానం గాలిలో ఉండగా దాని డోర్ ఊడి ఎగిరిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ డోర్ సమీపంలోని సీట్లలో ఉన్న ప్రయాణికుల చేతుల్లోని మొబైల్ ఫోన్లు, కొన్ని వస్తువులు కూడా ఆ విమానం నుంచి గాల్లోకి ఎగిరిపోయాయి. అయితే 16,000 అడుగుల ఎత్తు నుంచి కింద పడినప్పటికీ ఒక ఐఫోన్ చెక్కుచెదరలేదు.
వాషింగ్టన్: అలాస్కా విమానం గాలిలో ఉండగా దాని డోర్ ఊడి ఎగిరిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ డోర్ సమీపంలోని సీట్లలో ఉన్న ప్రయాణికుల చేతుల్లోని మొబైల్ ఫోన్లు, కొన్ని వస్తువులు కూడా ఆ విమానం నుంచి గాల్లోకి ఎగిరిపోయాయి. అయితే 16,000 అడుగుల ఎత్తు నుంచి కింద పడినప్పటికీ ఒక ఐఫోన్ చెక్కుచెదరలేదు. (iPhone Survives 16,000 Foot Drop) ఇది ఎంచక్కా పనిచేస్తోందని దీనిని గుర్తించిన వ్యక్తి తెలిపాడు.
జనవరి 6న అమెరికాలోని ఒరెగాన్ స్టేట్‌లో పోర్ట్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-9 మాక్స్ ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది. ఆ విమానం గాలిలో ఉండగా ఒక డోర్ ఊడిపోయి ఎగిరిపోయింది. సీటు బెల్ట్‌తో ఉన్న అందులోని 177 మంది ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. చివరకు ఆ విమానం అదే ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
కాగా, అలాస్కా విమానం గాలిలో ఉండగా డోర్ ఊడిపోయినప్పుడు దాని పక్క సీట్లలో ఉన్న ప్రయాణికుల చేతుల్లోని మొబైల్ ఫోన్లు, బ్యాగులు, కొన్ని వస్తువులు గాల్లోకి ఎగిరిపోయాయి. అలా ఎగిరిపోయిన ఒక ఐఫోన్ 16,000 అడుగుల ఎత్తు నుంచి భూమిపై పడింది. పోర్ట్లాండ్లోని బర్న్స్ రోడ్లో వాకింగ్ చేస్తున్న సీనాథన్ బేట్స్‌కు ఈ ఐఫోన్ కనిపించింది. ఎయిరోప్లేన్ మోడ్‌లో సగం బ్యాటరీ ఛార్జ్ ఉన్న ఆ ఐఫోన్ చెక్కుచెదరలేదని ఆయన తెలిపాడు. అలాస్కా విమానం నుంచి పడిన బ్యాగ్‌లో దీనిని గుర్తించినట్లు చెప్పాడు. ఈ ప్రమాదం గురించి దర్యాప్తు చేస్తున్న ఎన్‌టీఎస్‌బీకి ఈ ఐఫోన్ గురించి సమాచారం ఇచ్చినట్లు ఎక్స్‌లో పేర్కొన్నాడు. ఆ విమానం నుంచి ఎగిరి బయటపడిన వాటిలో గుర్తించిన రెండో మొబైల్ ఫోన్‌గా తెలుసుకున్నట్లు వెల్లడించాడు. ఈ ఐఫోన్‌కు సంబంధించిన ఫొటోను అందులో షేర్ చేశాడు.
మరోవైపు 16,000 అడుగుల ఎత్తు నుంచి నేలపై పడినప్పటికీ చక్కగా పని చేస్తున్న ఈ ఐఫోన్ మోడల్ ఏమిటన్నది నిర్థారణ కాలేదు. అయితే ఇది ఐఫోన్ 14 ప్రో లేదా ఐఫోన్ 15 ప్రో కావచ్చని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ఆపిల్ సంస్థకు చెందిన ఐఫోన్లపై ఇలాంటి అసాధారణ సంఘటనలు ఎలాంటి ప్రభావం చూపకపోవడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Found an iPhone on the side of the road… Still in airplane mode with half a battery and open to a baggage claim for #AlaskaAirlines ASA1282 Survived a 16,000 foot drop perfectly in tact!
When I called it in, Zoe at @NTSB said it was the SECOND phone to be found. No door yet😅 pic.twitter.com/CObMikpuFd
— Seanathan Bates (@SeanSafyre) January 7, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

