తాలిబన్లు చంపేలోపు… ఆఫ్ఘన్ మహిళ ఆత్మహత్య
బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపే శిక్షను ఆ మహిళకు విధించారు. దీంతో తాలిబన్లు అవమానకరంగా హింసించి చంపే ముందే ఆమె స్కాఫ్‌ను గొంతుకు బిగించుకుని ఆత్మహత్య చేసుకుంది.
కాబూల్: తాలిబన్లు చంపేలోపు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆ దేశంలోని ఘోర్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ వివాహిత వ్యక్తితో కలిసి శుక్రవారం ఇంటి నుంచి పారిపోయింది. ఆ జంటను తాలిబన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపే శిక్షను ఆ మహిళకు విధించారు. దీంతో తాలిబన్లు అవమానకరంగా హింసించి చంపే ముందే ఆమె స్కాఫ్‌ను గొంతుకు బిగించుకుని ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు ఆమెతో కలిసి పారిపోయిన వ్యక్తిని ఈ నెల 13న బహిరంగంగా ఉరి తీసి చంపారు. ఘోర్ ప్రావిన్షియల్ తాలిబన్ పోలీస్ చీఫ్ తాత్కాలిక ప్రతినిధి అబ్దుల్ రెహమాన్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఖామా ప్రెస్ పేర్కొంది.
కాగా, గత ఏడాది ఆగస్ట్‌లో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ జరుగుతుండగానే తాలిబన్లు అనూహ్యంగా రాజధాని కాబూల్‌లోకి చొచ్చుకొచ్చి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ దేశాన్ని మరోసారి పాలిస్తున్నారు. ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తూ మహిళలపై కఠిన ఆంక్షలు విధించారు. ప్రాథమిక హక్కులైన విద్య, ఉద్యోగాన్ని హరించారు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ మహిళలు మరోసారి దుర్భర జీవితం గడుపుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

