కాబూల్ : అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో బుధవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో తాలిబన్ మంత్రి ఖలీల్ హక్కానీ మరణించారు. రిఫ్యూజీ మినిస్ట్రీలో జరిగిన ఈ దాడిలో ఆయనతోపాటు మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఖలీల్ తాత్కాలిక ఇంటీరియర్ మినిస్టర్ సిరాజుద్దీన్ హక్కానీకి సమీప బంధువు. తాలిబన్లో శక్తిమంతమైన నెట్వర్క్కు సిరాజుద్దీన్ నాయకత్వం వహిస్తున్నారు. మూడేళ్ల క్రితం తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి జరుగుతున్న దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అత్యంత ప్రముఖ నేత ఖలీల్.