ఢాకా : ప్రజాదరణ పొందిన బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియాను ఆదివారం ఉదయం ఢాకా విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె భారత్-బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్మించిన ముజిబుర్ రెహ్మాన్ జీవిత గాథ చిత్రం ‘ముజిబ్:ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్’లో షేక్ హసీనా పాత్రను పోషించారు.
హసీనాకు వ్యతిరేకంగా ఈ సంవత్సరం జూలైలో జరిగిన విద్యార్థుల సామూహిక పోరాటం సందర్భంగా జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి ఫరియాను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ కేసు విషయమై ఇప్పటికే ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఆమె పలు భారత(ఎక్కువగా బెంగాలీ), బంగ్లాదేశీ సినిమాల్లో నటించారు.