ABC-Antoinette Lattouf | గాజా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంపై సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఇన్స్టాగ్రామ్’లో ఒక పోస్ట్ షేర్ చేసినందుకు ఆస్ట్రేలియాలో ఒక న్యూస్ చానెల్ ప్రెజెంటర్ ఉద్యోగం కోల్పోయారు. ఆస్ట్రేలియా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (ఏబీసీ) రేడియో షో నిర్వాహకురాలిగా ఉన్న సీనియర్ జర్నలిస్ట్, ప్రెజెంటర్ లెబనాన్ సంతతికి చెందిన ఆంటోనెట్టె లాట్టౌఫ్ను తొలగించడంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వెల్లువెత్తింది. ఏబీసీ మార్నింగ్స్ షోకు మూడు రోజుల పాటు నిర్వాహకురాలిగా ఉన్న ఆంటోనెట్టె లాట్టౌఫ్ను అకస్మాత్తుగా వెళ్లిపోవాలని ఒత్తిడి వచ్చిందని బీబీసీ ఓ వార్తా కథనం ప్రచురించింది. రాజకీయ కారణాలు, వివక్షతో తనను తొలగించారని ఆమె చెప్పారు. ఏబీసీకి వ్యతిరేకంగా కేసు నమోదు చేస్తానని ప్రకటించారు.
గాజా- ఇజ్రాయెల్ యుద్ధంలో హ్యుమన్ రైట్స్ వాచ్ సంస్థ షేర్ చేసిన ఒక పోస్టును తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడమే ఆమె తప్పిదం. దీనిపై ఇజ్రాయెలీ అనుకూల గ్రూపులు ఆంటోనెట్టె లాట్టౌఫ్కు వ్యతిరేకంగా లాబీయింగ్ చేశాయని, పక్షపాత పూరితంగా వ్యవహరించారని ఆమెపై అభియోగం. కానీ తన పనితీరు సంత్రుప్తి కరంగా ఉందని తెలిపారు. తాము ఇతరుల ఒత్తిళ్ల వళ్ల ఆంటోనెట్టె లాట్టౌఫ్ను తొలగించలేదని, తమ సంస్థ సోషల్ మీడియా నిబంధనలను ఉల్లంఘించినందుకే తొలగించామని ఏబీఎస్ ప్రకటించింది. కానీ ఏబీఎస్ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, తిరిగి తనకు ఉద్యోగం ఇవ్వాలని ఆంటోనెట్టే లాట్టౌఫ్ డిమాండ్ చేస్తున్నారు.