లండన్, సెప్టెంబర్ 13: బ్రిటన్‌కు చెందిన సిక్కు యువతిపై అక్కడి శ్వేత జాతీయులు ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమెపై జాత్యహంకార వ్యా ఖ్యలు చేశారు. ఆ యువతి బ్రిటన్‌కు చెందిన వ్యక్తి కాదని, ఆమె తన దేశానికి తిరిగి వెళ్లిపోవాలని లైంగిక దాడికి ముందు ఆ వ్యక్తులు బెదిరించారు.
ఈ నెల 9న ఉదయం వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ఓల్డ్బరీలోని టేమ్ రోడ్ వద్ద ఉన్న పార్కులో ఈ ఘటన జరిగింది. బాధిత సిక్కు యువతి ఫిర్యాదుమేరకు దీనిని జాత్యహంకార దాడిగా పరిగణిస్తున్నామని మిడ్ ల్యాండ్స్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బ్రిటన్‌లోని సిక్కు సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. లేబర్ పార్టీ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ దాడిని తీవ్రంగా ఖండించారు.