22 మందిని మింగిన మంచు

ఇస్లామాబాద్, జనవరి 8: పాకిస్థాన్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పర్వత పర్యాటక ప్రాంతమైన ముర్రీలో భారీ స్థాయిలో కురుస్తున్న మంచు కారణంగా వాహనాల్లో చిక్కుకొని సుమారు 22 మంది మృత్యువాత పడినట్టు అధికారులు శనివారం తెలిపారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు. వందల వాహనాలను మంచు నుంచి బయటకు తీశామని, వెయ్యికిపైగా వాహనాలు ఇంకా చిక్కుకుపోయాయని వెల్లడించారు. ఇస్లామాబాద్కు 45.5 కిలోమీటర్ల దూరంలో ఉండే ముర్రీకి ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తారు. నగరంలోకి వెళ్లే వీధులు శీతాకాలంలో మంచుతో మూసుకుపోతాయి. శనివారం నాలుగు అడుగులకుపైగా మంచు కురవడంతో ట్రాఫిక్ స్తంభించి, ప్రయాణికులు వాహనాల్లోనే చిక్కుకుపోయారని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

