న్యూఢిల్లీ, జూలై 26: అమెరికాలో సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. లాస్ ఏంజిలెస్‌లోని హాలీవుడ్ బర్బ్యాంక్ విమానాశ్రయం నుంచి శుక్రవారం బయల్దేరిన సౌత్‌వెస్ట్ విమానం, గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో హాకర్ హంటర్ యుద్ధ విమానానికి ఎదురుగా వెళ్లింది.
యుద్ధ విమానం రాకను గమనించిన పైలట్లు అకస్మాత్తుగా తమ విమానాన్ని 500 అడుగుల మేర కిందకు దించటంతో ప్రమాదాన్ని తప్పించారు.