Skin Cancer | విప్లవాత్మక ముందడుగు.. చర్మ క్యాన్సర్‌కు టీకా!
చర్మ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక ముందడుగు పడింది. మెలనోమా(ఒక రకమైన చర్మ క్యాన్సర్) తిరగబడకుండా నిరోధించే టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
- మెలనోమా మళ్లీ ఉత్పన్నం కాకుండా అడ్డుకునేలా అభివృద్ధి
- రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు
- త్వరలో మూడో దశ
Skin Cancer | లండన్, ఏప్రిల్ 27: చర్మ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక ముందడుగు పడింది. మెలనోమా(ఒక రకమైన చర్మ క్యాన్సర్) తిరగబడకుండా నిరోధించే టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మోడెర్నా, ఎంఎస్డీ అనే ఫార్మా కంపెనీలు ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. పలు కొవిడ్ వ్యాక్సిన్లలో ఉపయోగించిన ఎంఆర్ఎన్ఏ ఆధారిత టెక్నాలజీతో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. దీనిని ఎంఆర్ఎన్ఏ-4157(వీ940)గా పిలుస్తున్నారు.
ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన రెండో దశ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. మెలనోమా బాధితుల్లో మళ్లీ క్యాన్సర్ తిరగబడే ముప్పును సగం వరకు తగ్గించిందని తేలింది. ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్స్‌కు చెందిన వైద్యులు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,100 మందిపై క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి.
తొమ్మిది డోసుల వ్యాక్సిన్
ఈ వ్యాక్సిన్‌ను మూడు వారాలకు ఒక డోస్ చొప్పున తొమ్మిది డోసులు ఇస్తారు. వ్యాక్సిన్‌తో పాటు కీత్రుడా అనే మరో ఔషధాన్ని ఇస్తారు. మెలనోమా బారిన పడ్డ వారికి సర్జరీ చేసి తొలగించిన కణతుల నుంచి నమూనాను సేకరించి, ఏఐ ద్వారా డీఎన్ఏ సీక్వెన్సింగ్ చేసి ఆ రోగి అవసరానికి తగ్గట్టుగా వ్యాక్సిన్‌ను తయారుచేస్తారు. తద్వారా ఈ వ్యాక్సిన్ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను క్యాన్సర్ కణాలను వెంటనే గుర్తించి, వాటిని నాశనం చేసేలా సిద్ధం చేస్తుందని, మెలనోమా మళ్లీ తిరగబడకుండా చూస్తుందని యూసీఎల్‌హెచ్ ఆంకాలజిస్ట్ హెథెర్ షా తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

