Abraham Lincoln | వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ గే అని తాజా డాక్యుమెంటరీ చెప్తున్నది. ‘లవర్ ఆఫ్ మెన్ : ది అన్టోల్డ్ హిస్టరీ ఆఫ్ అబ్రహం లింకన్’ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో పురుషులతో లింకన్ రొమాంటిక్ రిలేషన్షిప్స్ గురించి వివరించారు. ప్రముఖ లింకన్ స్కాలర్స్ చెప్పిన విషయాలు, ఇప్పటి వరకు బయటపడని ఫొటోలు, లేఖలు వంటివాటి ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
హార్వర్డ్, కొలంబియా తదితర ప్రతిష్ఠాత్మక సంస్థలకు చెందిన చరిత్రకారుల ఇంటర్వ్యూలు ఈ డాక్యుమెంటరీలో ఉన్నాయి. సెక్సువల్ నియమాలు 19వ శతాబ్దంలో ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? వాటి మధ్య తేడాలు ఏమిటి? అనే అంశాలను దీనిలో వివరించారు.