వాషింగ్టన్, సెప్టెంబర్ 26: భూమిపైకి దూసుకొచ్చే ఆస్టరాయిడ్స్‌ను దారిమళ్లించే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా తలపెట్టిన డార్ట్ మిషన్‌కు సర్వం సిద్ధమైంది. మంగళవారం వేకువజామున 4.44 గంటలకు ‘డైమార్ఫస్’ అనే ఆస్టరాయిడ్‌ను డార్ట్ వ్యోమనౌక ఢీకొట్టనున్నది.
గ్రహశకలాల నుంచి భూమిని కాపాడటమే లక్ష్యంగా నాసా ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కాగా, ఈ ఎయిర్‌క్రాఫ్ట్ స్వయంచాలకంగా ఆస్టరాయిడ్‌ను లక్ష్యంగా చేసుకుని, ఢీకొడుతుంది. డైమార్ఫస్ దిశను మార్చుకునేలా చేస్తుంది.