బెర్లిన్, నవంబర్ 28: దోమకాటుతో ఓ వ్యక్తి బతికుండగానే నరకం చూశాడు. కొన్నివారాలపాటు కోమాలోనే ఉన్నాడు. శరీరంలో వివిధ అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకగా, వైద్యులు 30 శస్త్రచికిత్సలు చేశారు. అతడి రెండు కాలివేళ్లను తొలిగించారు. ఓ చిన్నదోమ అతడి జీవితాన్నే నాశనం చేసింది. ఈ ఘటన జర్మనీలో జరిగింది. సెబాస్టియన్ రోట్షే(27)ను 2021లో ఆసియా టైగర్ దోమ కుట్టింది. సెరాటియా అనే బ్యాక్టీరియా అతడి శరీరంలోకి ప్రవేశించింది. మొదట అతడికి ఫ్లూలాంటి లక్షణాలు కనిపించాయి. అనంతరం తొడభాగం మొత్తం పాడవడంతో మంచానికే పరిమితమయ్యాడు. కొన్ని వారాలపాటు కోమాలోనే ఉన్నాడు.రెండు కాలివేళ్లకు ఇన్ఫెక్షన్ సోకగా, పాక్షికంగా తొలగించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.