అంకార: వాయువ్య తుర్కియేలోని ప్రసిద్ధ స్కీ రిసార్ట్ వద్ద గల 12 అంతస్తుల హోటల్లో మంగళవారం మంటలు చెలరేగి 66 మంది పర్యాటకులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో 51 మంది గాయపడినట్టు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అలీ యెర్లీకయ తెలిపారు.
బొలు ప్రావిన్సులోని కర్తాల్కయ వద్ద గల రిసార్టులో ఉన్న 12 అంతస్తుల గ్రాండ్ కర్తాల్ హోటల్‌కు చెందిన రెస్టారెంట్లో తెల్లవారుజామున 3.30 గంటలకు మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.