న్యూఢిల్లీ: అమ్మాయిలపై ఇటీవల జరుగుతున్న అఘాయిత్యాలు అందరినీ కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. అందులో ఓ యువతి తలపై సీసీటీవీ కెమెరా బిగించి ఉంది. పాకిస్థాన్లోని కరాచీకి చెందిన ఆ యువతి తలపై స్వయంగా తండ్రే ఈ కెమెరాను అమర్చాడట.
తద్వారా ఆమెను నిరంతరం పర్యవేక్షించే వీలుంటుందని అతని భావన. తన తండ్రి ఏం చేసినా తన మంచికోసమేనని ఆమె సమర్థించుకున్నది. కరాచీలో ఇటీవల సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసు కారణంగానే తన తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నారని, తనకేదైనా జరిగినా సాక్ష్యం అయినా ఉంటుందని వివరించింది.
next level security pic.twitter.com/PpkJK4cglh
— Dr Gill (@ikpsgill1) September 6, 2024