కాబూల్: ఈ ఫోటో ఒక్కటి చాలు .. ఆఫ్ఘన్లో ఏం జరుగుతోంది చెప్పేందుకు. ఆఫ్ఘన్ల ఆర్తనాదాలకు ఇదో ఉదాహరణ. కాబూల్ విమానాశ్రయం ( Kabul Airport) వద్ద ఉన్న కాంక్రీట్ గోడ మీద.. ఇనుప వైర్ల నుంచి ఓ చిన్నారిని అవతల వైపు ఉన్న సైనికులకు అందుకున్న ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. తాలిబన్ల ఆక్రమణతో స్థానిక ప్రజలు వారి నుంచి పారిపోయేందుకు ఖర్జాయ్ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. ఆ సందర్భంలో విమానాశ్రయం లోపల ఉన్న సైనికులు చిన్నారులను అందుకున్నారు. దాంట్లో కొన్ని నెలల శిశువు కూడా ఉన్నాడు. ఆ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. అయితే ఆ శిశువును తల్లితండ్రులకు అప్పగించినట్లు అమెరికా సైన్యం తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం ఆ చిన్నారిని తీసుకోగా.. శుక్రవారం ఆ బేబీని పేరెంట్స్‌కు అప్పగించినట్లు మెరైన్స్ ప్రతినిధి జేమ్స్ స్టెంజర్ తెలిపారు.
The chaos & fear of people is a testament to the international community’s role in AFG’s downfall & their subsequent abandonment of Afghan people. The future for AFG has bn decided for its people without its people’s vote & now they live at the mercy of a terrorist group. #Kabul pic.twitter.com/k4bevc2eHE
— Omar Haidari (@OmarHaidari1) August 19, 2021
ఈ బేబీ ఒక్కరే కాదు.. కాబూల్ విమానాశ్రయంలో చాలా పెద్ద సంఖ్యలో చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. వారందరికీ అక్కడ ఉన్న సైనికులు సేవ చేస్తున్నారు. పేరెంట్స్ నుంచి వేరైన చిన్నారుల ఆలనాపాలనా సైనికులే చూసుకుంటున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఎప్పుడూ గన్స్‌తో పహారా కాసే సైనికులు.. ఆ పిల్లలకు పాలు తాగిస్తూ, వారిని ఆడిపిస్తూ.. విమానాశ్రయంలో గడుపుతున్నారు.
నిజానికి కాబూల్ నుంచి పౌరుల తరలింపు ప్రక్రియను చేపట్టడం అత్యంత క్లిష్టమైన పని అని నిన్న బైడెన్ కూడా తెలిపారు. తరలింపు ఆపరేషన్‌కు సరైన రీతిలో స్పందిస్తున్నట్లు మెరైన్స్ చెబుతున్నారు. 20 ఏళ్ల పాటు యుద్ధంతో రగిలిపోయిన ఆఫ్ఘనిస్తాన్‌లో తమ సైనికులు మానవతావాదాన్ని చాటుతున్నారని అమెరికా అంటోంది. ఖర్జాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న సైనికులు ప్రత్యేకంగా చిన్నారు రక్షణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పలు దేశాలకు చెందిన సైనికులు ఈ ప్రక్రియ తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు.
Babies and children were among the vulnerable amid the turmoil in Kabul as one video showed a baby being handed over to US soldiers, and another captured the moment Turkish soldiers comforted a two-month-old baby pic.twitter.com/9lVhOSvdvk
— TRT World (@trtworld) August 20, 2021
"An American soldier carrying a baby whose Afghan mother threw over the wall to save him."
— Melaia Waisale☆ (@ColourMeMental) August 20, 2021
There are many things many people can say about the US, and what happened in Afghanistan. But this is really one of those photos that say a thousand words. May God bless and keep you. pic.twitter.com/IxRxjz2TAU
Turkish soldiers help care for baby separated from her mother at Kabul airport https://t.co/jvck7jKFys pic.twitter.com/AS0ggaH4KY
— The National (@TheNationalNews) August 21, 2021