టెక్సాస్, జూన్ 24: మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఇండియా పోటీలంటే తమ అందచందాలతో జిగేలుమనిపించే యువతులు మన కళ్లముందు కదలాడతారు. అయితే అమెరికాలో జరిగిన మిస్ టెక్సాస్ యూఎస్ఏ పోటీలో యువతులతోపాటు 71 ఏండ్ల మరిస్సా టీజో అనే బామ్మ కూడా పాల్గొని రికార్డు సృష్టించారు.
హ్యూస్టన్లో నిర్వహించిన ఈ పోటీల్లో 75 మంది పాల్గొన్నారు. ఈ పోటీలో అరియెన్నా విజేతగా నిలిచి అందాల సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. లేటు వయసులో అందాల పోటీలో పాల్గొనడంపై టీజో మాట్లాడుతూ.. ఇలాంటి అందాల పోటీల్లో భాగస్వామినవ్వడం ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. మహిళలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి, ఏ వయసులోనైనా అందంగా ఉంటారు అని స్ఫూర్తి నింపడానికే తానీ పోటీల్లో పాల్గొన్నట్టు ఆమె తెలిపారు.