న్యూఢిల్లీ: కెనడాకు చెందిన బిలియనీర్ ఫ్రాంక్ స్ట్రోనాచ్(Frank Stronach)ను అరెస్టు చేశారు. అత్యాచారం, లైంగిక దాడి ఆరోపణలపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. టొరంటో శివారు ప్రాంతమై అరోరాలో 91 ఏళ్ల వ్యాపారవేత్తను అరెస్టు చేశారు. 1980 నుంచి 2023 వరకు బిలియనీర్ ఫ్రాంక్ లైంగిక దాడులకు పాల్పడినట్లు పీల్ రీజినల్ పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయిదు నేరాభియోగాలపై ఫ్రాంక్ స్ట్రోనాచ్‌ను అరెస్టు చేశారు. రేప్, దాడి, లైంగిక వేధింపులు లాంటి కేసుల్ని నమోదు చేశారు. ఎవరి వద్ద అయినా సమాచారం ఉంటే తమకు ఇవ్వాలని పోలీసులు అప్పీల్ చేశారు.
కెనడా మ్యాగ్నా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు స్ట్రోనాచ్. ఆ కంపెనీ ఆటోమొబైల్ పార్ట్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ప్రస్తుతం బిలియనీర్ ఫ్రాంక్ను రిలీజ్ చేశారు. అతను ఆంటారియో కోర్టులో హాజరుకానున్నారు. స్ట్రోనాచ్పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని అతని తరపు లాయర్ బ్రియాన్ గ్రీన్‌స్పాన్ తెలిపారు.