సిడ్నీ : భారతీయ మహిళ సమన్విత ధరేశ్వర్ ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె ఎనిమిది నెలల గర్భిణి. ఆమె తన భర్త, కుమారుడు (3)తో కలిసి హార్న్స్బైలోని జార్జి స్ట్రీట్‌లో రాత్రి 8 గంటల సమయంలో వాకింగ్ కోసం వెళ్లారు.
అదే ప్రదేశానికి కియా కార్నివాల్ కారు వచ్చింది. వీరు ఫుట్‌పాత్‌ను దాటేందుకు ఆ కియా కారును దాని డ్రైవర్ నెమ్మదిగా నడిపారు. కానీ వెనుక నుంచి వచ్చిన బీఎండబ్ల్యూ కారు వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది.