శబ్దంపై చిరాకుతో రోగి వెంటిలేటర్‌ను ఆఫ్ చేసిన వృద్ధురాలు.. తర్వాత ఏమైందంటే?
72 ఏళ్ల వృద్ధురాలు వెంటిలేటర్ శబ్దానికి చిరాకు చెందింది. దీంతో రాత్రి 8 గంటలకు ఆ వెంటిలేటర్‌ను ఆఫ్ చేసింది. గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే దానిని ఆన్ చేశారు. అలా చేయవద్దని, ఆ రోగికి ఆ రోగికి ఆక్సిజన్ అందించే ఆ పరికరం అత్యంత అవసరమని చెప్పారు.
బెర్లిన్: శబ్దంపై చిరాకుతో రోగి వెంటిలేటర్‌ను ఒక వృద్ధురాలు ఆఫ్ చేసింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రోగికి ప్రాణాపాయం కలుగుతుందని చెప్పారు. అయినప్పటికీ ఆ వృద్ధురాలు రెండోసారి కూడా వెంటిలేటర్‌ను ఆఫ్ చేసింది. ఈ నేపథ్యంలో రోగి ప్రాణాలకు ముప్పు కలిగించేందుకు ప్రయత్నించిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. జర్మనీలోని మ్యాన్‌హీమ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ నగరంలోని ఆసుపత్రిలో 79 ఏళ్ల వృద్ధురాలికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆ వార్డులో ఉన్న 72 ఏళ్ల వృద్ధురాలు వెంటిలేటర్ శబ్దానికి చిరాకు చెందింది. దీంతో రాత్రి 8 గంటలకు ఆ వెంటిలేటర్‌ను ఆఫ్ చేసింది. గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే దానిని ఆన్ చేశారు. అలా చేయవద్దని, రోగికి ఆక్సిజన్ అందించే ఆ పరికరం అత్యంత అవసరమని చెప్పారు.
అయినప్పటికీ రాత్రి 9 గంటలకు ఆ వృద్ధురాలు మరోసారి రోగి వెంటిలేటర్‌ను ఆఫ్ చేసింది. దీంతో ఆక్సిజన్ అందక 79 ఏళ్ల వృద్ధురాలి ఆరోగ్యం విషమించింది. స్పందించిన వైద్యులు ఆమెను ఐసీయూకు తరలించి మెరుగైన చికిత్స అందించారు. వెంటిలేటర్ ఆఫ్ చేసి రోగి ప్రాణాలకు ముప్పు కలిగించిన ఆ వృద్ధురాలిపై ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

