బుధవారం 28 అక్టోబర్ 2020
International - Oct 12, 2020 , 07:40:58

లిబియాలో కిడ్నాప‌ర్ల చెర‌నుంచి విడుద‌లైన భార‌తీయులు

లిబియాలో కిడ్నాప‌ర్ల చెర‌నుంచి విడుద‌లైన భార‌తీయులు

న్యూఢిల్లీ: లిబియాలో అప‌హ‌ర‌ణ‌కు గురైన ఏడుగురు భార‌తీయులు సుర‌క్షితంగా ఉన్నారు. వారంతా కిడ్నాప‌ర్ల చెర‌నుంచి విడుద‌లయ్యార‌ని ట్యునీషియాలో భార‌త రాయ‌బారి పునీత్ రాయ్ కుంద‌ల్ వెల్ల‌డించారు. విడుద‌లైన‌వారిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, గుజ‌రాత్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌వారున్నారని తెలిపారు. లిబియాలోని అశ్వ‌రీఫ్‌లో ఏడుగురు భార‌తీయుల‌ను సెప్టెంబ‌ర్ 14న దుండ‌గులు కిడ్నాప్ చేశారు. 

కాగా, లిబియాలో భార‌త్‌కు రాయ‌బార కార్యాల‌యం లేదు. దీంతో ట్యునీషియాలోని రాబారకార్యాల‌య అధికారులే లిబియాలోని భార‌తీయుల‌ సంక్షేమం, ఇత‌ర వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తుంది. ఏడుగురు భార‌తీయులు అప‌హ‌ర‌ణ‌కుగుర‌య్యార‌ని గ‌త గురువారం ట్యునీషియా కాన్సులేట్ ప్ర‌క‌టించింది. వారిని విడుద‌ల‌చేయిండానికి లిబియా అధికారుల‌తో మాట్లాడుతున్నామ‌ని తెలిపింది. ఈనేప‌థ్యంలో వారు కిడ్నాప‌రుల చెర‌నుంచి విముక్తిపొందార‌ని, వారు క్షేమంగా ఉన్నార‌ని రాయ‌బార కార్యాల‌యం పునీత్ వెల్ల‌డించారు. వారంతా సుర‌క్షితంగానే ఉన్నార‌నే విష‌యాన్ని దృవీక‌రించ‌డానికి లిబియా అధికారులు వారి ఫొటోల‌ను విడుద‌ల చేశార‌న్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo