America | వాషింగ్టన్ : వలసదారులను పెద్ద ఎత్తున అమెరికా నుంచి వెళ్లగొట్టడంలో భాగంగా ట్రంప్ ప్రభుత్వం దాదాపు 6 వేల మంది పేర్లను మృ తుల జాబితాలోకి చేర్చబోతున్నది. ఈ ప్రక్రియ గురించి తెలిసిన ఇద్దరు ఓ మీడియా సంస్థకు తెలిపిన సమాచారం ప్రకారం, దాదాపు 6 వేల మంది వలసదారుల సోషల్ సెక్యూరిటీ నంబర్లను రద్దు చేసి, వారు అమెరికాలో పని చేయకుండా, ఎటువంటి సేవలు, ప్రయోజనాలను పొందకుండా చేయడం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.
బ్యాంకు లు, ఇతర మౌలిక సేవలను పొందాలంటే సోషల్ సెక్యూరిటీ నంబర్లు తప్పనిసరి. సీబీపీ వన్ యాప్‌ను ఉపయోగించే వలసదారుల లీగల్ స్టేటస్‌ను ప్రభుత్వం రద్దు చేసింది.