నేపాల్‌లో భారీ భూకంపం.. ఆరుగురు మృతి
Nepal | నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు భూమికంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదయిందని నేపాల్ సీస్మోలజికల్ సెంటర్ తెలిపింది.
కఠ్మండూ: నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు భూమికంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదయిందని నేపాల్ సీస్మోలజికల్ సెంటర్ తెలిపింది. భూకంప కేంద్రం దీపయాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూకంపం ధాటికి దోటి జిల్లాలోని గైరాగాన్ ప్రాంతంలో ఇల్లు కూలిపోయింది. దీంతో ఆరుగురు మరణించారు. వారిలో మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. మరికొందరికి గాయాలయ్యాయని, ఆస్తినష్టం సంభవించిందని వెల్లడించారు.

నేపాల్‌లో గత 24 గంటల్లో భూకంపం రావడం ఇది మూడోసారి. మంగళవారం రాత్రి 8.52 గంటల ప్రాంతంలో 4.9 తీవ్రతతో మొదటి భూకంపం వచ్చింది. మళ్లీ 9.41 గంటల సమయంలో 3.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. కాగా, అర్ధరాత్రి సమయంలో వచ్చిన భూకంపంతో ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని గజియాబాద్, గురుగ్రామ్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కూడా భూమి కంపించింది. దీంతో మంచి నిద్రలో ఉన్న ప్రకంపనలతో భయాందోళనలకు గురయ్యారు. ఇండ్లనుంచి బయటకు పరుగులు తీశారు.
Earthquake of Magnitude:6.3, Occurred on 09-11-2022, 01:57:24 IST, Lat: 29.24 & Long: 81.06, Depth: 10 Km ,Location: Nepal, for more information download the BhooKamp App https://t.co/Fu4UaD2vIS @Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @moesgoi @OfficeOfDrJS @PMOIndia @DDNational pic.twitter.com/n2ORPZEzbP
— National Center for Seismology (@NCS_Earthquake) November 8, 2022
Earthquake of Magnitude:4.9, Occurred on 08-11-2022, 20:52:42 IST, Lat: 29.20 & Long: 80.88, Depth: 10 Km ,Location: Nepal, for more information Download the BhooKamp App https://t.co/HXadaOvHGF @Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @moesgoi @OfficeOfDrJS @PMOIndia @DDNational pic.twitter.com/kSr88G4L96
— National Center for Seismology (@NCS_Earthquake) November 8, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

