Earth Quake | నైరుతి మెక్సికో ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైందని యూఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తినష్టం సంబవించలేదని పేర్కొంది. కొలిమా సరిహద్దుకు సమీపంలో ఆగ్నేయ అక్విలాకు 21కి.మీ కేంద్రంగా 34 కిమీ లోతుల భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. రాజధాని మెక్సికో సిటీకి 600 కి.మీ దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని అధికారులు గుర్తించారు. మెక్సికో అధ్యక్షుడు క్లాడియా షైన్బాం స్పందిస్తూ బాదితులకు అత్యవసర సేవలు అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆదివారం తెల్లవారుజామున 2.32 గంటలకు మిచోయాకాన్ నగర పరిధిలో భూప్రకంపనలు సంభవించడంతో భవనాలు, కార్లు కదిలిపోయాయి. కదలికలు ఆగిపోయే వరకూ ప్రజలు వీధుల్లోకి దూసుకొచ్చారని మెక్సికో జాతీయ సిస్మటాలిజికల్ సర్వీస్ తెలిపింది.