స్కోప్జే: నైట్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. (Massive fire at nightclub) 50 మందికిపైగా సజీవదహనమయ్యారు. వంద మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది యువతేనని అధికారులు తెలిపారు. ఆగ్నేయ ఐరోపా దేశమైన నార్త్ మాసిడోనియాలో ఈ సంఘటన జరిగింది. రాజధాని స్కోప్జేకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కోకానిలోని పల్స్ నైట్‌క్లబ్‌లో ఆదివారం రాత్రి మ్యూజిక్ కన్సర్ట్ జరిగింది. ఆ దేశంలోని ప్రసిద్ధ హిప్-హాప్ జంట డీఎన్‌కే నిర్వహించిన సంగీత కచేరికి 1500 మందికిపైగా హాజరయ్యారు.
కాగా, అర్ధరాత్రి వేళ ఆ నైట్ క్లబ్లో అగ్నిప్రమాదం జరిగింది. ప్రేక్షకుల్లో ఎవరో బాణసంచా కాల్చారు. చెలరేగిన మంటలు బిల్డింగ్ అంతటా వ్యాపించాయి. దీంతో జనం భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. మంటల్లో కాలి కొందరు, తొక్కిసలాటలో మరికొందరు మరణించారు. 51 మంది మరణించగా మరో వంద మంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఉత్తర మాసిడోనియా ప్రధాన మంత్రి హ్రిస్టిజన్ మికోస్కీ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. చాలా కష్టమైన, విచారకరమైన రోజని అన్నారు. ‘చాలా మంది యువకుల ప్రాణ నష్టం పూడ్చలేనిది. బాధిత కుటుంబాలు, ప్రియమైనవారు, స్నేహితుల బాధ వెలకట్టలేనిది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. కాగా, నైట్ క్లబ్లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Tragic disaster in North Macedonia — dozens of young people burned alive in a nightclub fire
A fire broke out at a nightclub in the city of Kočani. At least 50 people have died, most likely very young.
The tragedy was caused by pyrotechnics — someone in the crowd set off… pic.twitter.com/LAVulBEUy3
— NEXTA (@nexta_tv) March 16, 2025