Bangladesh | బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. ప్యాసింజర్ రైలుకు నిప్పుపెట్టిన దుండగులు.. ఐదుగురు సజీవదహనం
సార్వత్రిక ఎన్నికల వేళ బంగ్లాదేశ్‌లో (Bangladesh) తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికలను (Elections) బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), దాని మిత్రపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి.
ఢాకా: సార్వత్రిక ఎన్నికల వేళ బంగ్లాదేశ్‌లో (Bangladesh) తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికలను (Elections) బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), దాని మిత్రపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. అయితే అవికాస్తా హింసకు దారితీశాయి. శుక్రవారం రాత్రి దేశ రాజధాని ఢాకాలోని గోపీబాగ్ ప్రాంతంలో బెనాపోల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఐదు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నదని, మంటలను అదుపుచేయడానికి గంటకు పైగా సమయం పట్టిందని అధికారులు వెల్లడించారు. రైలులో చాలామంది భారతీయ ప్రయాణికులు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. అయితే ఎలాంటి పక్షపాతం లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికను నిర్వహించాలని, ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్ని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త నిరసనలకు విపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.

#WATCH | A passenger train was set on fire in Bangladesh’s capital Dhaka yesterday (January 5) ahead of the country’s general election this weekend.
At least four people died aboard the intercity train, reports Reuters quoting local newspaper Dhaka Tribune.
(Source: Reuters) pic.twitter.com/FoFZVsqZ6u
— ANI (@ANI) January 6, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

