Bus Accident | అమెరికాలో టూరిస్టు బస్సు బోల్తా.. ఐదుగురు దుర్మరణం
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. నయాగరా జలపాతం అందాలను చూసి, న్యూయార్క్‌కు తిరిగి వెళ్తున్న టూరిస్టు బస్సు (Bus Accident) పెంబ్రోక్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది.
న్యూయార్క్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. నయాగరా జలపాతం అందాలను చూసి, న్యూయార్క్‌కు తిరిగి వెళ్తున్న టూరిస్టు బస్సు (Bus Accident) పెంబ్రోక్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి బోల్తా పడిపడిందని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో 1 నుంచి 74 ఏండ్ల మధ్య వయస్కులు ఉన్నారని, వారందరిని ఎయిర్ అంబులెన్స్‌లో దవాఖానకు తరలించామని చెప్పారు. మృతుల్లో చిన్నారులు ఎవరూ లేదని తెలిపారు.

ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ఉన్నారని, మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని ఆండ్రే రే అనే పోలీసు అధికారి వెల్లడించారు. పర్యాటకుల్లో అత్యధికులు భారత్, చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో న్యూయార్క్ హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇదొక విషాద ఘటన అని న్యూయార్క్ గవర్నన్ క్యాథీ హోచుల్ పేర్కొన్నారు. తమ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

