ఆఫ్ఘనిస్థాన్‌లో మంచు బీభత్సం.. 42 మంది దుర్మరణం..!
Afghanistan snowfall:

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో ఎడతెరపిలేని మంచుపాతం విషాదం మిగిల్చింది. భారీగా మంచు కురవడంతో ఆ భారానికి పలుచోట్ల ఆవాసాలు మంచులో కూరుకుపోయాయి. మరికొన్నిచోట్ల మంచు బరువుకు ఇండ్లు కూలిపోయాయి. ఈ ప్రకృతి వైపరీత్యం 42 మందిని పొట్టనపెట్టుకుంది. మరో 76 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు ఆఫ్ఘనిస్థాన్ ప్రకృతి వైపరీత్యాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది.
మొత్తం 15 ప్రావిన్స్‌లలో మంచుపాతం బీభత్సం కొనసాగిందని ఆఫ్ఘనిస్థాన్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. గత కొన్ని రోజులుగా ఆఫ్ఘన్లో మంచు వర్షం కురుస్తున్నదని, ఈ 20 రోజుల్లో దాదాపు 2,000 ఇండ్లు ధ్వంసమయ్యాయని ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ సర్కారు మీడియాకు తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చెప్పారు.
ప్రధాన రహదారులపై కూడా ఎక్కడికక్కడ మంచు పేరుకుపోవడంతో జనం ఎక్కడివాళ్లు అక్కడే ఇరుక్కుపోయారు. బాధితుల సహాయార్థ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లో గత వారం రెండు భూకంపాలు కూడా విషాదం మిగిల్చాయి. ఆ రెండు భూకంపాల ధాటికి 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 ఇండ్లు ధ్వంసమయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
కమ్యూనిటీల్లో నీటి కటకట
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

