సింగపూర్: ప్రేమిస్తావా.. కోట్ల నష్ట పరిహారం కడతావా? అంటూ కోర్టుకెక్కాడో వన్‌సైడ్ లవర్. సింగపూర్‌కు చెందిన కౌషిగన్ అనే వ్యక్తి తన ప్రేమ భావాలను పట్టించుకోకుండా స్నేహితుడిగా భావిస్తూ మానసికంగా తీవ్ర ఆవేదన కలిగిస్తోందంటూ టాన్ అనే యువతిపై రూ. 40 కోట్ల దావా వేశాడు.
ఆమె సమాజంలో తన పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగిందని, మానసికంగా తీవ్ర క్షోభ అనుభవిస్తున్నానని, ఆర్జన శక్తి కోల్పోయానని వెల్లడించాడు. ఈ నెల 9న వాదనలు ప్రారంభం కానున్నాయి.