చికాగో: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. షికాగోలో బుధవారం రాత్రి ఓ నైట్ క్లబ్ వెలుపల దుండగుడి కాల్పుల్లో నలుగురు మరణించగా, 14 మంది గాయపడ్డారు. ర్యాపర్ ఆల్బమ్ విడుదల సందర్భంగా ఈ క్లబ్లో పార్టీ జరిగింది.
పార్టీ పూర్తయిన తర్వాత జనం బయటకు వస్తుండగా, ఓ వాహనంలో వచ్చిన దుండగుడు వారిపై కాల్పులు జరిపాడు. అతను అదే వాహనంలో పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.