Helicopters Collide | ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లో ఉండగానే రెండు టూరిస్ట్ హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గోల్డ్ కోస్ట్‌లోని సీ వరల్డ్ థీమ్ పార్క్ సమీపంలో గల మెయిన్ బీచ్ (Main Beach)లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. టూరిస్ట్‌లను రైడ్‌కు తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.