వాషింగ్టన్, ఫిబ్రవరి 18: కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా అమెరికాకు చెందిన సాండియా నేషనల్ లాబొరేటరీస్ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. కొత్త 3డీ ప్రింటెడ్ లోహ మిశ్రమాన్ని వీరు తయారుచేశారు. దీన్ని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో వినియోగించడం ద్వారా తక్కువ కర్బన ఉద్గారాలు వెలువడుతాయని, ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 42 శాతం అల్యూమినియం, 25 శాతం టైటానియం, 13 శాతం నియోబియం, 8 శాతం జిర్కోనియం, 8 శాతం మాలిబ్డినం, 4 శాతం టాంటలమ్తో చేసిన ఈ కొత్త లోహ మిశ్రమం 800 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా బలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.