టోక్యో: జపాన్‌లోని హొక్కైడో విమానాశ్రయంలోని ఓ డొమెస్టిక్ టర్మినల్ వద్ద రెండు కత్తెరలు మిస్సయ్యాయి(Scissors Missing). దీంతో ఆ విమానాశ్రయంలో హైడ్రామా చోటుచేసుకున్నది. సుమారు 36 విమానాలను రద్దు చేశారు. మరో 201 విమానాలు ఆలస్యం అయ్యాయి. బోరింగ్ గేటు వద్ద ఉన్న స్టోర్ నుంచి రెండు కత్తెరలు కనిపించకుండాపోయాయి. దీంతో న్యూ చిటోస్ ఎయిర్పోర్ట్ టర్మినల్ వద్ద భారీగా సెక్యూర్టీ చెక్ చేశారు. రెండున్నర గంటల పాటు విమాన సేవలను నిలిపివేశారు. దీంతో వందల సంఖ్యలో ప్రయాణికులు స్తంభించిపోయారు. డిపార్చర్ లాంజ్‌లో పదేపదే సెక్యూర్టీ చెకింగ్ నిర్వహించడంతో ఆలస్యమైంది.
అయితే మరుసటి రోజున ఆ కత్తెరలను అదే స్టోర్‌లో అధికారులు గుర్తించారు. శనివారం మిస్సైన కత్తెరలు ఆదివారం దొరికినట్లు ఎయిర్‌పోర్టు ఆపరేటర్ వెల్లడించారు. ఈ ఘటన పట్ల విచారణ చేపట్టాలని టూరిజం శాఖ మంత్రి ఆదేశించారు. కత్తెరలు కనిపించకుండాపోవడం.. హైజాక్, ఉగ్రవాదంతో లింకై ఉంటుందన్న ఆలోచనతో విమనాలను రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. జపాన్‌లో ఉన్న రద్దీ విమానాశ్రయాల్లో న్యూ చిటోస్ విమానాశ్రయం ఒకటి. 2022లో కోటిన్నర మంది ఈ విమానాశ్రయాన్ని వాడారు.