రోమ్, జూలై 13: వెట్టిచాకిరిలో మగ్గిపోతున్న భారత్కు చెందిన 33 మంది వ్యవసాయ కూలీలకు ఇటలీ పోలీసులు శనివారం విముక్తి కల్పించారు. ఉత్తర వెరేనా ప్రాంతంలో వీరితో వెట్టిచాకిరి చేయిస్తున్న ఇద్దరు యజమానులపై దాడులు చేసి వారి నుంచి 545,300 యూరోలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
కాగా.. ప్రమాదంలో చేతిని పోగొట్టుకున్న భారతీయ కూలీని అతడి యజమాని నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై పడేసిన ఉదంతం వెలుగులోకి రావడంతో వెట్టిచాకిరీ చేయిస్తున్న యజమానులపై అధికారులు దృష్టి సారించి ఈ దాడులు చేశారు. భారత్కు చెందిన కొందరు ఏజెంట్లు పలువురు భారతీయులను ఇటలీకి రప్పించి గంటకు కేవలం 4 యూరోలు మాత్రమే ఇస్తూ రోజుకు 10-12 గంటలు పనిచేయిస్తున్నట్టు గుర్తించారు.