పడవలో ఎగిసిపడ్డ మంటలు.. 37 మంది సజీవదహనం
Bangladesh | బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ దేశ రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలోని జకాకతికి సమీపంలోని ఓ నదిలో వెళ్తున్న పడవలో ఆకస్మాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో పడవలో

ఢాకా : బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ దేశ రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలోని జకాకతికి సమీపంలోని ఓ నదిలో వెళ్తున్న పడవలో ఆకస్మాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో పడవలో ప్రయాణిస్తున్న వారిలో 37 మంది మంటల్లో కాలిపోయారు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు మరికొంత మంది నదిలో దూకారు. మంటల్లో గాయపడిన 100 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసు అధికారి మోయినుల్ ఇస్లామ్ తెలిపారు.

ఇంజిన్ రూమ్‌లో మంటలు
అయితే పడవ ఇంజిన్ రూమ్‌లో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటలకు చోటు చేసుకుంది. అప్పటికే అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. మంటల సెగకు మెలకువ వచ్చిన వారు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు నీటిలోకి దూకారు. మూడు అంతస్తుల్లో ఉన్న ఒబ్హిజాన్ 10లో ఒకేసారి 500 మంది ప్రయాణించొచ్చు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 500 మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గురైన పడవను నది ఒడ్డుకు తీసుకొచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

