బీరుట్: అనూహ్య పేలుళ్లతో లెబనాన్‌ను (Lebanon) వణికిపోతున్నది. వరుసగా పేజర్లు, వాకీటాకీలు, రేడియోలు పేలిపోతున్నాయి. దీంతో మృతుల సంఖ్య క్రమంగా పెరిగతున్నది. దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో ఇప్పటివరకు 32 మంది మరణించగా, 3,250 మంది గాయపడ్డారు. పేజర్లు పేలిన ఘటనలో 12 మంది మృతిచెంగా, వాకీటాకీల పేలుళ్లలో మరో 20 మంది చనిపోయారు. స్మార్ట్ఫోన్లు, ఇంటర్‌కామ్‌లు, సోలార్ ప్యానళ్లు సైతం పేలిపోతున్నట్టు స్థానికులు చెప్తున్నారు. రాజధాని బీరుట్ సహా తూర్పు, దక్షిణ లెబనాన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో హెజ్బొల్లా సభ్యులే లక్ష్యంగా ఏకకాలంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెలే ఈ దాడులకు దిగిందని భావిస్తున్నామని లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ పేలుళ్ల ఘటనలో మరణాల సంఖ్యల మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నారు.
కాఆ, లెబనాన్‌లో పేలిన వాకీటాకీలు జపాన్‌తో తయ్యారయ్యాయి. వాటిపై ఐకామ్ అని ఉన్నది. ఐకామ్ అనేది రేడియో కమ్యూనికేషన్స్, టెలిఫోన్ల కంపెనీ. అయితే లెబనాన్‌లో పేలిన వాకీటాకీల ఉత్పత్తిని 2014లోనే నిలిపివేశామని ఐకామ్ వెల్లడించింది. పేలుళ్లు జరిగిన టూవే రేడియో పరికరాలపై ఐకామ్ అని ఉన్నట్లు ప్రపంచ మీడియా పేర్కొన్నదని.. వాటిపై తాము దర్యాప్తు జరుతున్నామని ప్రకటించింది. ఈ ఘటన చుట్టూ నిజానిజాలను తేల్చుతామన్నారు. త్వరలో దీనికి సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నది.