ప్యాంగ్యాంగ్, సెప్టెంబర్ 4 : ఉత్తరకొరియా నియంత కిమ్ మరో దారుణానికి పాల్పడ్డారు. దాదాపు 30 మంది అధికారులను ఉరి తీయించినట్టు సమాచారం. ఇటీవల వరదలు రావటంతో పాటు కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలా మంది మరణించారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. అయితే, ప్రాణ, ఆస్తినష్టాలు నివారించటంలో అధికారులు విఫలం అయ్యారని.. అందుకే వారినందరినీ ఉరి తీయాలని కిమ్ ఆదేశించినట్టు దక్షిణ కొరియా మీడియా పేర్కొన్నది. గత నెలలో ఆ అధికారులకు మరణ దండన విధించారని వెల్లడించింది.